
దుకాణాల్లో చోరీ
కంచిలి: మకరాంపురం గ్రామ సచివాలయం సమీపంలో మూడు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. మీనాక్షి జిరాక్స్, బుక్ స్టోర్‌లో రూ.3వేలు నగదు, శ్రీ భూలోకమాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్‌లో సుమారు రూ.10వేలు నగదు, టార్చిలైట్లను పట్టుకుపోయారు. కూరగాయలు షాపు తాళాలు పగులగొట్టినా ఎటువంటి చోరీ జరగలేదు. బాధితులు కంచిలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో హెచ్‌సీ జె.రూప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
హిరమండలం: గొట్టా బ్యారేజి వద్ద కొరసవాడ గ్రామానికి చెందిన ఏడురి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంతో వెళ్తూ అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. శనివారం సుభలయ నుంచి స్వగ్రామం కొరసవాడకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి బాధితుడిని ఆటోలో హిరమండలం పీహెచ్‌సీ తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో రిమ్స్‌కు తరలించారు.