
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఢిల్లీ చేరారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కొత్తగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీర్ఘ కాలంగా మోహన్ చరణ్ మాఝి కొలువు విస్తరణ ఊగిసలాడుతోంది. ఇదిలా ఉండగా అతి త్వరలో నువా పడా ఉప ఎన్నిక జరగనుంది. మోహన్ చరణ్ మాఝి సర్కారుకు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్‌కు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో తొలి సారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రత్యక్ష ఎన్నిక కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. విపక్షాలు అంతే ధీటుగా ఈ స్థానం కై వసం చేసుకునేందుకు వ్యూహ రచనల్లో తలమునకలై ఉన్నాయి. నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నిక దగ్గర పడుతుంది. నాలుగు సార్లు బిజూ జనతా దళ్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజేంద్ర ఢొలొకియా అకాల మరణం కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఇది భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలో విజయంతో ఈ స్థానం కై వసం చేసుకోవడంలో అధికార బారతీయ జనతా పార్టీ, విపక్షం బిజూ జనతా దళ్, కాంగ్రెసు ఎవరి తరహాలో వారు పదునైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. అధికార, విపక్షాలు యువతరంతో బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తుండగా కాంగ్రెసు అనుభవజ్ఞుడైన అభ్యర్థితో పూర్వ వైభవానికి కొత్త ఊపిరి పోయాలని యోచిస్తుంది.
ఉప రాష్ట్రపతికి అభినందనలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ పథకాలు తదితర దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఉప రాష్ట్రపతికి ’ఒడిశా విజన్ 2036 – 2047 పుస్తకం అందజేశారు.
నువాపడా ఉప ఎన్నికకు వ్యూహరచన
మంత్రి మండలి విస్తరణ
సంప్రదింపులు