
అనుపు ఉత్సవంలో ఘర్షణ
● ఆరుగురికి గాయాలు
● ఆరుగురు అరెస్టు
భువనేశ్వర్: కటక్ నగరంలో ప్రతిష్టాత్మక దుర్గా పూజల నిమజ్జనం ఊరేగింపులో అకస్మాత్తుగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో అమ్మవారి ఊరేగింపు మధ్యలో ఆగింది. ఊరేగింపు సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఈ పరిస్థితి నెలకొంది. నడి రోడ్డు మీద దేవీ ఊరేగింపు వాహనాలను నిలిపి వేశారు. రాత్రి అంతా ఇదే పరిస్థితి కొనసాగింది. దర్ఘా బజార్ ప్రాంతంలో జరిగిన వర్గ ఘర్షణలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీ ఈ దాడిలో గాయపడ్డారు. రాళ్ల దాడిలో డీసీపీ కన్ను ప్రాంతం గాయపడి తీవ్ర రక్తస్రావమైంది. ఝంజిర్ మంగళ పూజా కమిటీ ఊరేగింపులో వర్గ ఘర్షణ చోటు చేసుకుంది. డీజే ధ్వనుల్ని వ్యతిరేకిస్తూ మొదలైన నిరసన రాళ్ల దాడికి దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో గాజు సీసాలు రువ్వుకున్నారు. ఆకస్మిక ఉద్రిక్తత నియంత్రణ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిమ్ సాహి వద్ద ఉద్రిక్తతతో దేవీగొడొ వైపు వెళ్లే ఊరేగింపులు రోడ్డుపై నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి అంతా కటక్ రౌస్ పట్న దుర్గా ఊరేగింపు నిమ్ సాహి వద్ద నిలిచిపోయింది. దర్గఘ బజార్ అణుపు ఉత్సవం ఘర్షణ ఘటనలో ఆరుగురు నిందితులను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోను పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కటక్ నగరం అదనపు పోలీసు కమిషనర్ నరసింహ భోలా తెలిపారు.

అనుపు ఉత్సవంలో ఘర్షణ

అనుపు ఉత్సవంలో ఘర్షణ

అనుపు ఉత్సవంలో ఘర్షణ