
రాయగడ జలమయం
రాయగడ: బుధవారం ఏకధాటిగా కురిసిన వానకు రాయగడ నీటమునిగింది. స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద కొండచరియలు విరిగి పడిపోవడంతో ట్రాక్ ముక్కలైంది. దీంతో రాయగడ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగిల్ లైన్ మీదుగా రైళ్ల రాకపోకలు సాగించారు. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాయగడ మీదుగా విశాఖపట్నం ఇటు రాయిపూర్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్ మరమ్మతు పనులతో పాటు కొండచరియలు తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాదిపదికన జరిగింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు.
సదరు సమితి పిప్పలగుడ గ్రామంలో చంద్రమండంగికి చెందిన ఇల్లు కూలిపోయింది. గుణుపూర్‌లో అరటి, వరి తదితర పంటలు నీట మునిగాయి. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ప్రహరీ వర్షాలకు కుప్పకూలింది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక జిల్లాలోని గుణుపూర్‌లో బుధవారం పర్యటించారు. వర్షం వల్ల కలిగే నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొతొ ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి గురువారం గుణుపూర్‌లో పర్యటించారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలు కలియదిరిగారు. తెగిన రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.

రాయగడ జలమయం

రాయగడ జలమయం

రాయగడ జలమయం

రాయగడ జలమయం