
తడిచిముద్దయిన కొరాపుట్
కొరాపుట్: భారీ వర్షాలకు కొరాపుట్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. గురు, శుక్రవారాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. కొరాపుట్–రాయగడ మార్గంలో బంగ్లాగుడ వద్ద వరద నీరు రోడ్డెక్కింది. దాంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి. మరో వైపు సిమిలిగుడ వద్ద విశాఖ పట్నం మార్గంలో కూడా వర్షం నీరు రోడ్డు మీద ప్రవహించింది. కొరాపుట్ సమీపంలో డుమ్రి పుట రాళ్లు, మట్టి రైల్వే ట్రాక్ మీద పడ్డాయి. దాంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైల్వే విభాగ అత్యవసర పునరుద్ధరణ తర్వాత రైళ్లు నడుపుతున్నారు. కొలాబ్ రిజర్వాయర్ నీరు ప్రమాద సూచిక వద్దకు చేరడంతో గేట్లు తెరిచారు. సిమిలిగుడ సమితిలో వర్షం నీరు పోటెత్తింది.
సిమిలిగుడ సమితిలో వర్షపు నీటికి పాడైన పొలాలు

తడిచిముద్దయిన కొరాపుట్

తడిచిముద్దయిన కొరాపుట్

తడిచిముద్దయిన కొరాపుట్