–పర్లాకిమిడి: జిల్లాస్థాయి గాంధీజీ వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న నిర్మలా శెఠి
–పర్లాకిమిడి:విజేతలైన విద్యార్థులతో పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి
జయపురం: గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రబినారాయణ నందో తదితరులు
రాయగడ: గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఏడీఎం నాయక్, పక్కనే కలెక్టర్ కులకర్ణి
జయపురం: మహాత్మా గాంధీ చిరస్మరణీయులని.. ఆయన దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహానీయుడని వక్తలు అన్నారు. కొరాపుట్ జిల్లా వెనుకబడ్డ వర్గాల కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హసన్ మదాని ఆధ్వర్యంలో జాతిపిత గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జన్మదినోత్సం సందర్భంగా స్థానిక కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనంలో కార్యక్రమం నిర్వహించారు. గాంధీ, శాస్త్రిల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హసన్ మదాని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ నిర్వహించిన భూమికను వివరించారు. అలాగే ప్రధానమంత్రిగా శాస్త్రిజీ దేశానికి అందించిన నిస్వార్ధ సేవలు గుర్తు చేశారు. నేటి యువత గాంధీ, శాస్త్రిలు నచిచిన బాటలో పయనించి సమాజానికి సేవలు అందించాలని పిలుపు నిచ్చారు.
రాయగడ:
స్థానిక గాంధీ పార్కులో మహాత్మగాంధీ జయంతిని గురువారం జిల్లా యంత్రాంగం ఘనంగా జరుపుకుంది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, ఏడీఎం నవీన్ చంద్ర నాయక్, జిల్లా పౌరసంబంధాశాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, విద్యావేత్త డీకే మహాంతి తదితర ప్రముఖులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం సర్వమత ధర్మాలకు చెందిన గ్రంథాలను ఆయా మతగురువులు చదివి వినిపించారు.
బీజేడీపాద యాత్ర
జయపురం: గాంధీ జయంతి సందర్భంగా జయపురం విధాన సభ నియోజకవర్గం బీజేపీ నాయకులు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్ముని నిర్వహించిన భూమికను ప్రశంసిస్తూ పాదయాత్రం ప్రారంభించింది. రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రబినారాయణ నందో నాయకత్వంలో వందలాదిమంది శ్రేణులు పాల్గొన్నాయి. ముందుగా జయపురం శాసనసభ నియోజకవర్గంలో జయపురం సమితి అంబాగుడ గ్రామ పంచాయతీ అంబాగుడలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర బీజేపీ జనసంపర్క అభిజాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాద యాత్రలో మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు గాంఽధీ జయంతిని జన సంపర్క అభిజాన్‌గా పాటిస్తున్నామని వెల్లడించారు. కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక కార్యదర్శి దుర్గా ప్రసాద్ మిశ్ర, సీనియర్ నేత, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్నారథ్), కొరాపుట్ జిల్లా పరిషత్ మాజీ సభ్యులు బి.బాలంకిరావు, బొరిగుమ్మ సమితి సీనియర్ నాయకుడు నాగరాజు దొర, సీనియర్ నేతలు శివ పట్నాయక్, సత్యదాన్ మహానందియ, టున రథ్, లింగ రాజ్ పాత్రో, పింటు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: జాతీపిత మహాత్మాగాంధీ, శాంతిదూత లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను పర్లాకిమిడి గాంధీ స్మారక ప్రాథమిక అప్పర్‌గ్రేడ్ పాఠశాలలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. తొలుత గాంధీ జంక్షన్, గ్రంథాలయం వద్ద గాంధీ విగ్రహానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలాశెఠి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ స్మారక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా విశ్రాంత తహసీల్దార్ పూర్ణచంద్ర మహాపాత్రో, ముఖ్యవక్తగా బిచిత్రానంద బెబర్తా, ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర ప్రధాన్, డీపీఆర్వో ప్రదిప్త గురుమయి విచ్చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలో విజేతలైన విద్యార్థులకు పురపాలక అధ్యక్షురాలు నిర్మతా శెఠి బహుమతి ప్రదానం చేశారు.
మహాత్మునికి ఘనంగా నివాళి
మహాత్మునికి ఘనంగా నివాళి
మహాత్మునికి ఘనంగా నివాళి