
భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు
మల్కన్‌గిరి: విజయదశమి సందర్భంగా దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో గురువారం పూజలు చేశారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని దండకారణ్య పూజ మండపంలో బెంగాలీ మహిళలు ఘనంగా ఽసిందూర్ ఖేలాను ఆడి సందడి చేశారు. దుర్గాపూజల్లో అమ్మవారికి సిందూర్ సమర్పించారు. అనంతరం ఒకరిపై ఒకరు సిందూర్‌ను పోసుకొని అమ్మవారి ఎదుట నాట్యం చేశారు.
హోమపూజలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని నక్టిమ్మా అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రులు చేసిన భక్తులు చివరి రోజైన గురువారం అమ్మవారికి హోమ పూజలు చేశారు. తొమ్మిది రోజులు స్థానిక పురోహితురాలు లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీక్షబూనిన స్వాములు పూజల్లో పాల్గొన్నారు.
జయపురం: కుండపోత వర్షంలో సైతం దుర్గాదేవికి భక్తులు పూజలు చేశారు. ఆలయాల్లో, మండపాల్లో, గృహాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. . మా భగవతి మందిరం నుంచి అందంగా అలంకరించిన పల్లకీలో మా భగవతి, మా విజయ బయలు దేరగా మాదక్షిణ కాళీ, మా బసంత మయిలు కలసి అందమైన పల్లకీల్లో ఊరేగింపుగా రాజనగర్ కూడలి నుంచి ముందుకు సాగాయి. రాజ కోట నుంచి కనకదుర్గ పల్లకీ కూడా వాటితో బయలు దేరింది. ఊరేగింపులో పట్టణంలో వివిధ దుర్గా మండపాల్లో ప్రతిష్టించిన దుర్గాదేవి ప్రతిమలను చిత్ర విచిత్ర వేషదారులతో బాణసంచా కాల్చుతూ ప్రధాన ర్యాలీలో కలిశాయి. అర్ధరాత్రి రెండు గంటల వరకు సాగిన దసరా ర్యాలీలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ముందుగా జరిగిన సభలో సాంస్కృతిక ప్రదర్శనలు , ప్రముఖులకు సత్కారాలు చేశారు. దసరా ఉత్సవాలలో యువరాజు విశ్వంబర చంద్ర చూడ్ దేవ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు.

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు