
ఘనంగా దుర్గాదేవికి పూజలు
పర్లాకిమిడి:
దసరా శరన్నవరాత్రి వేడుకలు గురువారంతో వైభవంగా ముగిశాయి. చివరి రోజున పర్లాకిమిడిలో పలు కూడళ్లలో ప్రతిష్టించిన చేసిన దుర్గామాత విగ్రహాలను ఊరేగిస్తూ సమీపం చెరువులు, సాగరాల్లో నిమజ్జనం చేశారు. పెద్ద బ్రాహ్మణ వీధి, హైస్కూల్ జంక్షన్, కటిక వీధి, చిత్రకారవీధి, తెలుగు చాకలి వీధి వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత ఆడంబరంగా ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి చేశారు. దుర్గామాతాలకు భక్తులుహారతులిచ్చి.. టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని సాగనంపారు. సీతా సాగరం వద్ద దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవాలను పూర్తి చేశారు.
పెండ్రాని దేవికి ప్రత్యేక పూజలు..
జయపురం: దసరా ఉత్సవాలకు పేరున్న పెండ్రాని గ్రామ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పెండ్రాని గ్రామం నుంచి వచ్చిన పెండ్రాని దేవికే పట్టణ ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వడం ఆనవాయితీ. రాజుల కాలం నుంచి జయపురం దసరాలో పలు గ్రామ దేవతలో లాఠీలతో పాటు పెండ్రాణి దేవి లాఠీలు పాల్గొంటున్నాయి. ఈసారి కూడా పెండ్రాని దేవి ప్రతినిధిలుగా తీసుకొచ్చిన లాఠీలకు వేలాదిమంది భక్తులు పూజలు చేశారు. పెండ్రాని దేవితో దిశారీలు పలు లాఠీలు, భాజా భజంత్రీలతో వచ్చారు. వారికి దేవదాయ విభాగం వారు ఆశ్రయం, వంటలు చేసుకోనేందు బియ్యం తదితర సౌకర్యాలు సమకూర్చారు. దసరా ఉత్సవాలలో అవిభక్త కొరాపుట్‌లో పలు గ్రామాల నుంచి 60 కి పైగా గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నట్లు దేవాలయ విభాగ అధికారులు వెల్లడించారు.

ఘనంగా దుర్గాదేవికి పూజలు