
సోమన్ వాంగ్‌చుంగ్‌ను విడిచి పెట్టాలి
● కమ్యూనిస్టు పార్టీ డిమాండ్
జయపురం: జిల్లా కమ్యూనిస్టు పార్టీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా 26వ జాతీయ రహదారి.. జయపురం ప్రధాన జంక్షన్‌లో ఆ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ గాంధేయ వాది, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విద్యావేత్త, పర్యావరణ ప్రేమికులు, వైజ్ఞానికులు వాంగ్‌చుంగ్‌ను విడిచి పెట్టాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. 2019లో జమ్మూ కశ్మీర్ 370 సెక్షన్‌ను కేంద్రంలో బీజేపీ ఎత్తి వేయటం, ఎన్నికల వాగ్దానంలో లేహ్ లదక్, కార్గిల్‌లకు పూర్తి రాజ్యాంగహోదా కల్గిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోనికి వచ్చిన తరువాత వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంచిందని ఆరోపించారు. ఆ ప్రాంతాల వారికి పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీలకు ఇస్తున్న అధికారాలను వర్తింప చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ మహంతి కోరారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శ రామకృష్ణ దాస్, నేతలు నంద కుమార్, హరికృష్ణ జాని పాల్గొన్నారు.