
87 మంది పండిట్లకు పదోన్నతులు
శ్రీకాకుళం: జిల్లాలో పనిచేస్తున్న 87 మంది పండిట్లకు పదోన్నతులు కల్పిస్తూ డీఈవో రవిబా బు బుధవారం ఉత్తర్వులు అందజేశారు. వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే ఇకపై వీరంతా స్కూల్ అసిస్టెంట్లుగా కొనసాగుతారు. ‘పదోన్నతులకు నోచుకోని పండిట్లు’ పేరి ట ఐదు రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పండిత సంఘాల నాయకులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్పందించారు. రాష్ట్రస్థాయిలో అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పండితుల పదోన్నతుల సమస్యను తక్షణం పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 65 మంది తెలుగు, 18 మంది ఒరియా, నలుగురు హిందీ పండిట్లకు పదోన్నతు లు లభించాయి. బుధవారం డీఈవో కార్యాలయంలో పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారు. పదో న్నతులు కల్పించడం పట్ల భాషా ఉపాధ్యాయ సంస్థ నాయకులు పిసిని వసంతరావ, రంగనాయకు లు, ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

87 మంది పండిట్లకు పదోన్నతులు