
దక్షిణకాళీ మందిరం పరిశుభ్రం
జయపురం: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రజల ఆరాధ్య దేవతల్లో ఒకరు పూర్ణఘడ్‌లో వేంచేసి ఉన్న దక్షిణకాళీ మందిరాన్ని ప్రతీరోజు స్థానిక శ్రీరామ సేవా కమిటీ సభ్యలు పరిశుభ్రం చేస్తున్నారు. అంతే కాకుండా ఆలయంలో మా దక్షిణకాళీకి సేవలు చేస్తున్నారు. శ్రీరామ సేవా కమిటీ కార్యదర్శి సానా జగదీస్ నేతృత్వంలో ప్రతీరోజు ఉదయం వచ్చి ఆలయాన్ని పరిసర ప్రాంతాలను పరిశుభ్ర పరుస్తున్నారు. కార్యదర్శి జగదీస్ మంగళవారం సాక్షితో మాట్లాడుతూ దక్షిణ కాళీ మందిరానికి ప్రతీరోజు వందలాది మంది భక్తులు వస్తున్నారని, భక్తులకు అసౌకర్యం కలుగ కుండా శ్రీరామ సేవా కమిటీ సభ్యులతో దసరా ఉత్సవాలు ముగిసేంత వరకు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు వచ్చి పరిశుభ్ర పరుస్తున్నామని వెల్లడించారు. భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. మంగళవారం దక్షిణ కాళీ ఆలయానికి వచ్చిన గ్రామ దేవతల లాఠీలకు శ్రీరామ సేవా కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బవిరెడ్డి రమణ, ఎ.తిరుమల రావు, ఎస్.మల్లికార్జున రావు, బి.గుప్తేశ్వర రావు, బాబూరావు, సీతారాం, పి.రవి, వి.రామారావు, పట్నాన ప్రతాప్, జి.వెంకట రమణ, జి.రమణ, జి.శ్రీలత, వి.మల్లేశ్వరి, ఎస్.రేవతి. వి.పద్మ, ఎన్.స్వాతి, పావని, జి,భవాని, పి.మాధురి, జి.శ్రీలత, పి.అరుణ పాల్గొన్నారు.

దక్షిణకాళీ మందిరం పరిశుభ్రం

దక్షిణకాళీ మందిరం పరిశుభ్రం

దక్షిణకాళీ మందిరం పరిశుభ్రం