
నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు
రాయగడ: నవ్వు ఆరోగ్యానికి ఎంతొ మేలు చేస్తోందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ సభ్యులు అన్నారు. ఈ మేరకు చెక్కాగుడలోని ప్రేమ్ పహాడ్ వద్ద మంగళవారం ఉదయం నిర్వహించిన నవ్వుల కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి మాట్లాడుతూ.. మన నిత్యజీవితంలో నవ్వు ఎంతో అవసరమని అన్నారు. ఎప్పుడూ ఒత్తిడితో ఉండే మనం నవ్వు వల్ల ఉపశమనం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రతిఒక్కరూ కొద్ది సమమైన నవ్వడం, నవ్వించడం వంటి కార్యక్రమాల్గో పాల్గొనాలని అన్నారు. నవ్వువల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి వివరించారు. తమ క్లబ్ మంచిలక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నా రు. అందరినీ ఆనందంగా ఉంచడం, నవ్వించడం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరిచి పలు కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి అనంతరం చర్చించారు. కార్యక్రమంలొ క్లబ్ ఉపాధ్యక్షులు ఎ.మహాంతి, సలహాదారుడు ఉదయ్ పండ పాల్గొన్నారు.