
అలరించిన నాటకం
రాయగడ: స్థానిక రాణిగుడ ఫారం వద్ద న్యూటౌన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మూ కొహుచి సొమోయో అనే నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆద్యంతం రసభరితంగా సాగిన ఈ నాటకం రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇమిడి ఉన్న ఈ నాటక సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సమయానికి ఎవరూ అతీతులు కారన్న ముఖ్య సందేశంతో కొనసాగిన ఈ నాటకంలో విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, బ్రజసుందర్ నాయక్, ప్రముఖ హాస్యనటుడు ప్రభాకర్ మిశ్రొ (టున్నా టన్ టన్), డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, శివ మిశ్రొ, డాక్టర్ ద్వితీ చంద్ర సాహు, బాబులాల్ గంతాయిత్, అజిత్ కుమార్ పాణిగ్రహి, రవి సతపతి, మానస్ రొథొ, ప్రణతి పాత్రొ, భవాని మిశ్రో తదితర కళాకారులు పాల్గొన్నారు.

అలరించిన నాటకం