
రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: రక్తదానం చేయడంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, యువత అపోహలు వీడి రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక పిలుపునిచ్చారు. సదరు సమితి జేకేపూర్‌లో గల టీమ్ కణ్యారాశింఖ్ అనే సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం వంటి సమాజిక సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని సూచించారు. ఈ శిబిరంలో 42 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం వారికి సంస్థ సమకూర్చిన ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పట్నాన గౌరి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తనిధి అధికారుల పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు.

రక్తదానం.. ప్రాణదానం