ఇంటిపై కూలిన భారీ వృక్షం | - | Sakshi
Sakshi News home page

ఇంటిపై కూలిన భారీ వృక్షం

Sep 30 2025 8:42 AM | Updated on Sep 30 2025 8:42 AM

ఇంటిప

ఇంటిపై కూలిన భారీ వృక్షం

ఇంటిపై కూలిన భారీ వృక్షం కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి మెక్కా పంచాయతీ మఝారిగూఢ గ్రామంలో సోమవారం ఓ భారీ వృక్షం ఇంటిపై కూలిపోయింది. విజయ్‌ పట్నాయక్‌ కుటుంబ సభ్యుల తో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వేకువజామున భారీవర్షం కారణంగా పక్కనే ఉన్న చెట్టు కూలిపోయింది. సోమవారం ఉదయం మత్తిలి అగ్నిమాపిక సిబ్బందికి చేరడంతో వారువచ్చిన చెట్టును తొలగించారు. అలానే సమీపంలో అంగన్‌వాడీ కేంద్రంపై కూడా మరో చెట్టు పడడంతో దాని కూడా తొలగించారు.

రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంఘం కార్యాలయం భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించా రు. విశాఖపట్నానికి చెందిన ఇండస్‌ ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో వైద్యులు హృద్రోగ, ఆర్థో పరీక్షలను వైద్య నిపుణులు హాజరయ్యారు. 80 మంది హృద్రోగ, 40 మందికి ఆర్థో పరీక్షలను చేపట్టారు. సంఘం అధ్యక్షులు కింతలి అమర్‌నాథ్‌, కార్యదర్శి టి. జయ రాం, కోశాధికారి వి.మురళి, సభ్యుల పర్యవేక్ష ణలో శిబిరం జరిగింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ సంఘం వైద్య శిబిరాన్ని నిర్వహించామని.. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నాహాలు చే స్తున్నామని అధ్యక్షులు అమర్‌నాథ్‌ తెలిపారు.

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు

పలాస: మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు చెక్కభజన, కోలాటం, తదితర జానపద కళారూపాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు దక్కడం గొప్ప విషయమని పలాస మండలం రంగోయి గిడుగురామ్మూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు చెప్పారు. కళాపీఠం సభ్యులు తవిటినాయుడు, సాయికుమార్‌లు మలేషియాలో నెలరోజుల పాటు అక్కడి తెలుగువారికి జానపద కళల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

స్తంభాన్ని ఢీకొట్టి

యువకుడు మృతి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల సమీప వాటర్‌ట్యాంక్‌ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యు వకుడు ఢీకొట్డాడు. ఈ నెల 27న జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నం హనుమంతువాకకు చెందిన కొత్తలంక పూర్ణచంద్రరావు తీవ్రంగా గాయపడి ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం వెల్లడించారు.

వివాహమై మూడు నెలలే..

శ్రీకాకుళం రిమ్స్‌ ప్రభుత్వాసుపత్రిలో పరిపాలనావిభాగంలో కార్యాలయ అసిస్టెంట్‌గా ఉన్న పూర్ణచంద్రరావుకు విశాఖ యువతి పావనితో మూడు నెలల కిందట వివాహమైంది. పూర్ణచంద్రరావు కారుణ్య నియామకంలో రిమ్స్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శనివారం రిమ్స్‌ లో గాయాలతో పూర్ణచంద్రరావు చేరినా అక్క డి సిబ్బంది ఎందుకో గోప్యంగా ఉంచారని భార్య పావని చెప్పినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ వెల్లడించారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిచంద్ర (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. అదే సమయములో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న హరిచంద్ర పిడగు ధాటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కొత్తూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడు. హరిచంద్రకు భార్య అనసూయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇంటిపై కూలిన భారీ వృక్షం 1
1/1

ఇంటిపై కూలిన భారీ వృక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement