
శాంతియుతంగా దుర్గా పూజలు
● గవర్నర్ హరిబాబు కంభంపాటి ● దుర్గా పూజా మందిరం సందర్శన
భువనేశ్వర్: దుర్గాదేవి పూజోత్సవాలకు పేరొందిన కటక్ నగరంలో జోబ్రా ప్రాంతంలో రజత ప్రభ దే వీ పూజా మండపాన్ని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబా బు కంభంపాటి ప్రారంభించారు. ఆయనతో ప్రథ మ మహిళ జయశ్రీ కంభంపాటి పాల్గొని దుర్గా దేవి కి అఖండ దీపారాధన చేశారు. కటక్ నగర వారసత్వ చేతిపనుల వెండి ప్రభల సంప్రదాయం ప్రపంచ ప్రఖ్యాతకు ప్రేరణగా గవర్నర్ ప్రశంసించారు. నగరంలో పూజాదులు శాంతియుతంగా, ఆనందంగా ముగియాలని గవర్నర్ దంపతులు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ దంపతులకు పూజా నిర్వాహక కమిటీ సభ్యులు స్వాగతించారు. వారు మేధ ఏర్పాట్లు, కళాత్మకత గురించి వివరించారు. గవర్నర్, ప్రథమ మహిళకు బారాబటి ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌస్, చౌద్వార్ నియోజకవవర్గం ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్, కటక్ నగర పాలక సంస్థ సీఎంసీ మేయర్ సుభాష్ చంద్ర సింగ్, జిల్లా యంత్రాంగం అధికారులు స్వాగతం పలికారు.

శాంతియుతంగా దుర్గా పూజలు