
వ్యాయామంతో గుండె చప్పుడు పదిలం: హైటెక్
భువనేశ్వర్:
క్రమబద్ధమైన వ్యాయామం ఆరోగ్యవంతమైన గుండెకు భద్రత కల్పిస్తుందని, ఈత, సైక్లింగ్, నడక వంటి సాధారణ అలవాట్లలతో గుండె చప్పుడు సురక్షితంగా ఉంటుందని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా స్థానిక హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ నుంచి జీజీపీ కా లనీ వరకు సోమవారం వాకథాన్ నిర్వహించారు. హైటెక్ వర్గం కార్డియాలజీ విభాగం ప్రముఖుడు డాక్టర్ రితేష్ ఆచార్య, సీటీవీఏ నిపుణుడు డాక్టర్ శ్వేతా దాస్, సీఈఓ జ్యోతిర్మయ్ పండా, విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాలు ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, నడకకు ప్రాధాన్యత కల్పించడం గుండె నిరంతర చప్పుడుకు హామీపూర్వక ఆచరణగా వాకథాన్‌లో పాల్గొన్న హృద్రోగ వైద్య, చికిత్స నిపుణులు తెలిపారు. హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైటెక్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు సమతుల్య పౌష్టిక ఆహారంతో దైనందిన శారీరిక వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.

వ్యాయామంతో గుండె చప్పుడు పదిలం: హైటెక్