
పాత్రికేయునిపై తుపాకి దాడి
భువనేశ్వర్: కటక్ జిల్లా బొడొంబా ప్రాంతంలో పా త్రికేయునిపై ఆగంతకులు తుపాకీ గురి పెట్టారు. ఈ దాడిలో అతని భుజం, వేళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. నువాపడా గ్రామంలో ఆదివారం రాత్రి దుండగులు బాధితుని ఇంటిలోకి చొరబడి కాల్పు లు జరిపారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణలో రిపోర్టర్ మనోజ్ నాయక్ బాధితునిగా గుర్తించారు. పాత కక్షలతో ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకుని నిందితుడిని బొడొంబా ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహనా బ్లాక్ గరడమా పంచాయతీ నుంచి గంభారీ గ్రామానికి ట్రాక్టర్ ద్వారా రేషన్ బియ్యం తీసుకెళ్తుండగా.. డెప్పగుడ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టరులో ఉన్న కూలీలు, డ్రైవర్‌తో సహా పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బ్రాహ్మణిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన చికి త్స నిమిత్తం మోహనా మెడికల్‌కు తరలించా రు. మోహనా పోలీసులు దీనిపై ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.