
ఆకట్టుకుంటున్న ‘పూరీ’ పెండల్
కొరాపుట్: పూరీ దివ్యధాం నమూనాలో నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండిలో ఏర్పాటు చేసిన దసరా పెండల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏటా అవిభక్త కొరాపుట్ జిల్లాలలో అత్యంత ఖరీదైన దసరా పెండల్స్ ఏర్పాటు చేస్తుంటారు. కోల్‌కతా శిల్పులను రప్పించి నిర్మిస్తారు. వీటిని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు.
పది కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ అబ్కారీ శాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుట్రాగుడ కూడలిలో దాడులు నిర్వహించారు. పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వారిలో బలరాం పూజారి, స్వరలీ పాత్రొ ఉన్నారు. ఫుల్బాణి జిల్లా బలిగుడకు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా వీరు పట్టుబడ్డారు.
శుభేందుకు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు
పర్లాకిమిడి: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని భువనేశ్వర్‌లోని జయదేవ్ భవన్‌లో ఒడిషా పర్యాటక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్లాకిమిడి మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ మాస్టర్ శుభేందు మోహన్ సేనాపతికి ఉత్తమ కొరియాగ్రాఫర్ అవార్డు లభించింది. ప్రపంచ టూరిజం దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర శాసనసభ స్పీకర్, కార్యదర్శి సురమా పాఢి చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అకుంఠిత దీక్షతో చేసిన కృషికి ఫలితం లభించిందని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అభినందించారు. ఈ సందర్భంగా శుభేందును పర్లాకిమిడిలో పలు నృత్య సంస్థలైన పదామృత న్యత్య అకాడమీ, జగన్నాథ డ్యాన్సు అకాడమీ నిర్వాహకులు అభినందించారు.
రక్తదాన శిబిరానికి విశేష స్పందన
జయపురం: జయపురంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి నూతన ప్రార్థన మందిరంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా హాజరై 25 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జయపురం సబ్ డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్లు అభయ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకుంటున్న ‘పూరీ’ పెండల్

ఆకట్టుకుంటున్న ‘పూరీ’ పెండల్

ఆకట్టుకుంటున్న ‘పూరీ’ పెండల్