
సీనియర్ల ఆశీర్వాదం కోసం..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రుపక్ తురుక్ ఆ పార్టీ సీనియర్ల అశీర్వాదం తీసుకొనే యాత్ర ప్రారంభించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కుందిలి గ్రామంలో సంత వద్ద నివాసం ఉంటున్న మాజీ ఎంపీ జయరాం పంగి నివాసానికి వెళ్లి అతన్ని కలిశారు. పంగి సానుకూలంగా స్పందించి రుపక్‌ని సాధారంగా ఆహ్వానించి తన పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయని అభయమిచ్చారు. రుపక్ వెంట మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో కేవలం కొరాపుట్ ఎంపీ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో ఉంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడింట కాంగ్రెస్ గెలుపొందింది. ఈ జిల్లాలోని పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్ర ఖడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి కొరాపుట్ జిల్లాలో ఎంతో మంది సీనియర్లని కాదని యువకుడు రుపక్ తురుక్‌కి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం గమనార్హం.