
‘మాస్టర్ మైండ్’ ప్రభ అరెస్ట్
● మరో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు కూడా..
అల్లిపురం (విశాఖ): కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను మహారాణిపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ దివాకర్ యాదవ్ ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గోమంగి గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ అలియాస్ ప్రభ గంజాయి స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రధారి. అతను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి.. గోమంగి నాని బాబు, లోచలి కుమారస్వామి అనే ఇద్దరు యువకుల సహకారంతో సరఫరా చేయిస్తున్నాడు. ప్రభకు గంజాయి రవాణాలో అపార అనుభవం ఉంది. తన ఎత్తుగడలు ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తూ.. మాస్టర్‌మైండ్‌గా మారాడు. కాగా.. పాత నేరస్తుల నుంచి సేకరించిన సమాచారం, ప్రభ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శనివారం సాయంత్రం వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్ద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో టూటౌన్, పెందుర్తి, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పోలీస్ స్టేషన్లతో పాటు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లలోనూ గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. లోచలి కుమారస్వామి, గోమంగి నాని బాబులపై కూడా విశాఖ రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ దివాకర్ యాదవ్, హెడ్ కానిస్టేబుళ్లు సురేష్, నంద కిశోర్, కానిస్టేబుల్ నాగేంద్రలను సీపీ, డీసీపీ–1, ఈస్ట్ ఏసీపీ అభినందించారు.
భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిద్దాం
జయపురం: దసమంతపూర్‌లో విప్లవ వీరుడు సహిద్ భగత్ సింగ్ జయంతిని ఆదివారం నిర్వహించారు. అఖిల భారత యువ సంఘం కొరాపుట్ జిల్లా శాఖ అధ్యక్షుడు కుమార్ జాని నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాని మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు భగత్ సింగ్ ధైర్య సాహసాలతో పోరాటం చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరిబందు నాయక్, సత్య పొరజ, భానుమతి, బొబిత ముదులి, తదితరులు పాల్గొన్నారు.