
39 కిలోల గంజాయి పట్టివేత
పర్లాకిమిడి: ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన వేర్వేరు దాడుల్లో 39 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్.ఉదయగిరి బ్లాక్ మర్లబ గ్రామం వద్ద పోలీసులు దాడులు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు బోలేరో వాహనంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మూడు బస్తాల్లోఉన్న 39 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వారిలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం హుగీ జిల్లాకు చెందిన కమల్ ఉద్దీనీ, మోహానా బ్లాక్ శికులిపదర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అబ్కారీ శాఖ సదర్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్ తెలియజేశారు. మరో గంజాయి కేసును ఆర్.ఉదయగిరి పరిసర గ్రామం వద్ద మహామ్మద్ సంసద్ అన్సారీ వాహనం కోసం ఎదురుచూస్తుండగా మొబైల్ అబ్కారీ టీంకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ఒక బ్యాగులో తరలించేందుకు ఉంచిన గంజాయితో పట్టుబడినట్టు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ మొన్ను ఆయాల్ తెలిపారు. నిందితులు ముగ్గుర్ని శనివారం జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. దాడుల్లో ఎకై ్సజ్ శాఖ మొబైల్ ఎస్సై కె.బాలజీరావు, ఏఎస్సైలు నీలాంబర్ నాయక్, బిజయానంద బెహారా ఉన్నారు.
కలిమెల సమితిలో 40 కిలోలు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి 40 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. బేజాంగ్‌వాడ రహదారి కలువ వద్ద శుక్రవారం రాత్రి కలిమెల ఎకై ్సజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ సామల్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ పికాప్ వాహనం అతివేగంగా రవడంతో దాన్ని అపి ప్రశ్నించగా అందులో ఉన్నవారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అనూమానంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. రెండు బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి అరెస్టు చేసి కలిమెల ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. శనివారం పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 40 కిలోలు ఉందని.. దీని విలువ రూ. 3.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో మోటు గ్రామ మాజీ సర్పంచ్ మున్న సోడి, పుసుగూఢ గ్రామానికి చెందిన ఆశిష్ సాల్బాం ఉన్నారన్నారు. వీరిపై కేసునమోదు చేసి కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు

39 కిలోల గంజాయి పట్టివేత