
మహిళా కళాశాలలో ఆరోగ్య శిబిరం
పర్లాకిమిడి: స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నారీ ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని శిబిరాన్ని అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ అధికారులు శనివారం నిర్వహించారు. స్వస్థ్య నారీ..స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో విశ్రాంత అధ్యక్షురాలు డాక్టర్ భారతీ పాణిగ్రాహి, జిల్లా మెడికల్ శాఖ తరఫున వి.లక్ష్మీకుమారి పట్నాయక్, సంతోషీకుమారీ జెన్నా తదితరులు విద్యార్థినులకు రక్తపరీక్షలు జరిపారు. కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్ అధికారి, క్రిష్ణ చంద్ర గజపతి కళాశాల అధ్యాపకులు కృష్ణచంద్ర పండిట్ పర్యవేక్షించగా, మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మహిళా కళాశాలలో ఆరోగ్య శిబిరం