
మిషన్ శక్తి సిబ్బంది ధర్నా
పర్లాకిమిడి: మిషన్ శక్తి కమ్యూనిటీ సపోర్టు సిబ్బంది ఽసి.ఆర్.పి, ఎం.బి.కె, కృషిమిత్ర, ప్రాణమిత్ర, బ్యాంకు మిత్ర, క్యాడర్ల కింద సేవలు అందిస్తున్న మహిళా సంఘం సభ్యులు శనివారం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిషన్ శక్తి సంఘం అధ్యక్షురాలు సంయుక్తా ప్రధాన్ మాట్లాడుతూ మహిళా కార్యకర్తలకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర మిషన్ శక్తి సంఘం ఆదేశాల మేరకు ఆరు రోజులుగా రాయఘడ బ్లాక్ ఎదుట ధర్నా చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. మిషన్ శక్తి సపోర్టు సిబ్బందికి ఆరు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్యకర్తల జీతం బ్యాంకు ఖాతాల్లో జమ చేసి, ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం రాయగడ బి.డి.ఓ. సుశాంత్ కుమార్ ప్రధాన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన స్పందిస్తూ మిషన్ శక్తి విభాగం నుంచి జీతభత్యాల విషయమై ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.

మిషన్ శక్తి సిబ్బంది ధర్నా