పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధుల మంజూరు | - | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధుల మంజూరు

Sep 28 2025 7:00 AM | Updated on Sep 28 2025 7:00 AM

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధుల మంజూరు

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధుల మంజూరు

ఈఈ బాధ్యతల నుంచి తప్పించండి భార్య మందలించిందని... రవాణా సదుపాయాలతో అభివృద్ధి

పర్లాకిమిడి: స్థానిక బృందావన్‌ ప్యాలస్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జిల్లా అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా అదనపు మాజిస్ట్రేట్‌ ఫల్గుణి మఝి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్‌చార్జి పర్యాటక అధికారి అరుణ్‌కుమార్‌ త్రిపాఠి, ప్రమోద్‌ పాడీ, అంజనా పట్నాయక్‌ హాజరయ్యారు. జిల్లాలో ప్రసిద్ధ మహేంద్రగిరి, గండాహతి, గుద్‌ గుదా, ఖసడా జలపాతాల వద్ద ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు పడవేయకుండా పరిశుభ్రత పాటించాలని ఏడీఎం అన్నారు. జిల్లాలో చంద్రగిరి బౌద్ధరామాలు, బృందావన్‌ ప్యాలస్‌, గండాహతి, మహేంద్రగిరి అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే టూరిజం రిసార్టులు, నక్షత్ర హోటళ్లు నిర్మించనున్నారని పర్యాటక అధికారి అరుణ్‌ కుమార్‌ త్రిపాఠి అన్నారు. విద్యార్థులకు ‘పర్యాటకం, స్థిరమైన అభివృద్ధి’ అనే అంశంపై క్విజ్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు ఏడీఎం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ సిబ్బంది సుధీర్‌ కుమార్‌ హోత్త, బిచిత్రానంద బెబర్తా సహకరించారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ కి ఇన్‌చార్జి ఈఈ ఉన్నటువంటి తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రమోద్‌కు మార్‌ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిసింది. విశాఖపట్నంలోని ఇదే విభాగంలో క్వాలిటీ కంట్రోల్‌ డీఈఈగా పనిచేస్తున్న ఆయనను ఈనెల 1వ తేదీన ఇన్‌చార్జి ఈఈగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికీ.. తరచూ సెలవు పెడుతూ వస్తున్నారు. ఐదు రోజుల క్రితం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో ఇంజినీరింగ్‌ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలవు పెట్టిన ప్రమోద్‌ కుమార్‌ శనివారం ప్రధాన కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై సంప్రదించగా ఆయన అందుబా టులోకి రాలేదు. డీఈఈ సిమ్మన్న వద్ద ప్రస్తా వించగా లేఖ రాసిన విషయం తెలిసిందని, అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించుకోవాల్సి ఉందని తెలిపారు.

నరసన్నపేట: మండలంలోని కంబకాయకు చెంది న కెల్ల రాజారావు(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం గడ్డి మందు తాగడంతో కుటుంబసభ్యులు గమనించి నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందు తూ శనివారం ఉదయం మరణించినట్లు నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సరుబుజ్జిలి మండలం చిగురువలసకు చెందిన రాజారావు కంబకాయకు చెందిన రామలక్ష్మిని వివాహం చేసుకొని ఇక్కడే ఇల్లరి కం ఉంటున్నారు. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం వీరిద్దరూ ఘర్షణ పడగా, భార్య రామలక్ష్మ రాజారావును మందలించింది. దీనిని తట్టుకోలేక రాజారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాజారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆమదాలవలస: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత ముఖ్యమ ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన బెర్హంపూర్‌ – సూరత్‌ (ఉద్నా) అమృత్‌ భారత్‌ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్‌ భారత్‌ రైలు దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్నారు. శ్రీకాకుళం, పలాసలో రెండు హాల్ట్‌లు ఇచ్చినట్లు తెలిపారు. విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్‌ భారత్‌ రైళ్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం లలి త్‌ బొహ్రా, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షుడు శివ్వల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉద్దానం ప్రజలకు వరం

పలాస: బరంపురం నుంచి సూరత్‌ వెళ్లే అమృత్‌ భారత్‌ రైలు ఉద్దానం ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ఖుర్ధా ఏఆర్‌డీఎం ప్రమోదకుమార్‌ బెహరా అన్నారు. పలాస రైల్వేస్టేషన్‌లో రైలు స్వాగత కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సూరత్‌, కాండ్ల, గుజరాత్‌, రాయపూర్‌, బిలాయ్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, వారికి ఈ రైలు చాలా ఉపయోగమన్నారు. కార్యక్రమంలో డీసీఎం సుక్రాంబరో, పలాస రైల్వే మేనేజర్‌ ఎస్‌కే దాసు, పలాస – కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement