
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై వర్క్‌షాప్
జయపురం: తర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ సభాగృహంలో వర్క్‌షాప్ నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్త్లుకు మార్కెటింగ్ సౌకర్యం, జాతీయ సహకార డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సహకార సమితిల ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ ణణాలు సౌకర్యం సమకూర్చటం పైన చర్చించారు. క్షేత్ర స్థాయి నుంచి రైతులకు సహకార బ్యాంక్‌లు సేవలు చేర్చేందుకు అక్టోబర్ నుంచి జిల్లాలో మరో రెండు బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డ్ సీడీఎం ఎస్.కె.తలుక్‌దార్ వెల్లడించారు. వర్క్‌షాపులో కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి, కొరాపుట్ సహకార సంస్థల డిప్యూటీ డైరెక్టర్ మోనిక రాయ్, కార్యదర్శి హరిశ్చంద్ర బొనాగడి, నాబార్డ్ డీజీఎం దేవేంద్ర ప్రధాన్ ప్రసంగించారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై వర్క్‌షాప్