
నూతన డీసీసీ అధ్యక్షులకు అభినందనలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో నూతనంగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుల నియామకంపై అభినందనలు వెల్లువెత్తాయి. కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు రూపక్ తురుక్‌ని జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు రామచంద్ర ఖడం శనివారం అభినందించారు. నబరంగ్‌పూర్ జిల్లా నుంచి జిల్లా పరిషత్ సభ్యురాలు డాక్టర్ లిఫికా మజ్జి డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమె మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జి కుమార్తె. నబరంగ్‌పూర్ జిల్లాలో 26 జెడ్పీ స్థానాలకు లిఫికా ఒక్కరే కాంగ్రెస్ నుంచి గెలిపొందారు. ఈ విడత రెండు జిల్లాల్లో యువతకే అధ్యక్ష పదవులు దక్కాయి. వీరిద్దరి ఎంపీక వెనుక కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ముద్ర ఉందని కాంగ్రెస్ అభిమానులు పేర్కొంటున్నారు.
డీసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధరణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు గోవింద పాత్రో అధ్యక్షతన నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావును శనివారం సత్కరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

నూతన డీసీసీ అధ్యక్షులకు అభినందనలు

నూతన డీసీసీ అధ్యక్షులకు అభినందనలు