
కూలిన సేవా పేపరుమిల్లు బెల్ట్
జయపురం: జయపురం గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లు బొగ్గు రావాణా చేసే బెల్ట్(కన్వేయర్ బెల్ట్) కూలిపడింది. రెండు రోజుల కిందట జరిగిన సంఘటన శనివారం వెలుగులోనికి వచ్చింది. కన్వేయర్ బెల్టు సుమారు 40 అడుగుల పైనుంచి పడిందని.. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేక పోవటంతో పెను ప్రమాదం తప్పింది. సేవా పేపరుమిల్లులో గత 14 నెలలుగా ఉత్పత్తి ఆగిపోయిందని అందువలన మిల్లు మూతపడటంతో మిల్లు రక్షణ పర్యవేక్షణ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేపరుమిల్లు కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి ఆరోపించారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చర్ గత కొన్నేళ్లుగా శిధిలావస్తలో ఉందని యాజమాన్యం దృష్టికేంఽధ్రీకరించలేదని ఆయన ఆరోపించారు. 2020 ఆగస్టు 8 వ తేదీన కురిసిన కుండ పోత వర్షాల కారణంగా మిల్లులో పెద్ద పైకప్పు కూలిపడిందని ఆయన గుర్తు చేసారు. మిల్లు ఇలా శిధిల మౌతున్నా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్య బట్టారు. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా చెల్లించటంలేదని, గత 14 నెలలుగా కార్మికులకు జీతాలో చేల్లించలేదని మహంతి ఆరోపించారు.జీతాలు లభించక పోయిన కొంతమంది జీతాలు వస్తాయన్న ఆశతో డ్యూటీకి వెలుతున్నారని ఆయన వెల్లడించారు.ఆగస్టు నెల నుండి మిల్లునడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినా నేటికీ ఆయన వాగ్దానం కార్యరూపం దాల్చలేదని మహంతి విమర్శించారు. మిల్లు థాపర్ గ్రూపు నుండి మధర్ అర్ధ , ప్రస్తుతం మరో కంపెనీ ఇలా యాజమాన్యం మారుతున్న సమస్య ఎచ్చటేసిన గొంగలి లాగనే ఉందని విమర్షించారు.ఇటువంటి పరిస్థిలతిలో రోజురోజుకు మిల్లు దుర్బళ స్థితికి చేరుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.జయపురంలో ఉన్న ఏకై క ఫ్యాక్టరీ సేవా పేపరుమిల్లు అని అధోగతి స్థితికి చేరుకుంటున్నదని.. ఇప్పటికై నా మిల్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.