
● ఎన్‌సీసీ కేడెట్లకు సత్కారం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు బాలికల ఎన్‌సీసీ కేడెట్లు, పీవోను శుక్రవారం అధికారులు సత్కరించారు. విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ఎన్‌సీసీ అధికారి సంతోషినీ ముండ, కేడెట్లు స్వాతీ జాని, నగమ నిగోర్, శక్తిశ్రీయ పట్నాయక్‌లు న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత స్థాయి సేవా క్యాంప్‌లో పాల్గొన్నారు. వీరు రాష్ట్ర రాజధానిలో మూడు నెలలు శిక్షణపొంది ఒడిశా తరఫున న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయిలో జరిగిన శిబిరంలో పాల్గొని ప్రతిభకనబర్చారు. ఈ సందర్భంగా వారిని విక్రమదేవ్ విశవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయిక్ తదితరులు అభినందించి సత్కరించారు.