
వేట సాగక.. పూట గడవక..!
గార:
కడలి తల్లి కరుణిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి మత్స్యకారులది. వేట సాగితేనే కుటుంబాల పూట గడుస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు మత్స్యకారుల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారుతుండడంతో వేట సాగడం లేదు. వేట నిషేధం అనంతరం వరుసగా నాలుగు నెలల్లో ఏకంగా 27 రోజుల పాటు తుఫాన్లు, వాయుగుండాల ప్రభావం వలన వేటకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్ సంభవిస్తున్నా వాతావరణ హెచ్చరికలు ఆధారంగా అప్రమత్తత పేరుతో వేట నిలిపేయాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. కానీ ఒక్కోసారి వాతావరణ హెచ్చరికలకు విరుద్ధంగా సముద్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అందువలన ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో భృతి ఇస్తున్నట్టే.. తుఫాన్, వాయుగుండాల సమయంలో వేటకు వెళ్లకుండా అర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో 193 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలోని 11 మండలాల్లో మత్స్యకారులు జీవ