
విద్యార్థిని బలవన్మరణం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎంవీ 13 గ్రామంలో ఉంటున్న విద్యార్థిని అంకితా విశ్వస్ (21) గురువారం రాత్రి ఆత్మాహత్యకు పాల్పడింది. బృందవాన్ విశ్వస్ తన కుటుంబంతో మల్కన్‌గిరి సమితి ఎంవీ 13 గ్రామంలో నివసిస్తూ కుమార్తె అంకితా విశ్వస్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా. కుటుంబీ సభ్యులు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి రక్షించగా.. గురువారం ఉదయం ఇంటికి వచ్చేశారు. అయితే గురువారం రాత్రి అంతా భోజనాలు చేసిన తరువాత నిద్రకు ఉపక్రమిస్తుండగా అంకితా విశ్వస్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతుర్ని గమంచిన తండ్రి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. సమాచారం అందుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమార్తె ఎవరినో ప్రేమించిందని.. అయితే ప్రేమించిన వ్యక్తి పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అఘాయిత్యానికి పాల్పడిందిన తండ్రి బృందావన్ పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

విద్యార్థిని బలవన్మరణం