
● క్రీడాస్ఫూర్తితో మెలగాలి
రాయగడ: క్రీడాకారులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే అందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పాటు క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ అన్నారు. స్థానిక బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాయగడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంబోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఒ అన్నాసాహెబ్, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్, జేకేపేపర్ మిల్ సీఎస్‌ఆర్ స్మతిరేఖ కొరొ, రాయగడ జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్ అధ్యక్షుడు హిమాంశు శేఖర్ పండియా తదితరులు పాల్గొన్నారు.

● క్రీడాస్ఫూర్తితో మెలగాలి