
టికిరిని సమితిగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీని సమితిగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝికి ఆ ప్రాంత ప్రతినిధులు గురువారం వినతిపత్రం సమర్పించారు. కాసీపూర్ సమితిలో 24 పంచాయతీలు ఉండగా సుమారు లక్షకు పైబడి జనాభా ఉన్నారని చెప్పారు. జనాభాపరంగా అభివృద్ధి చెందుతున్న కాసీపూర్ సమితిని విభజించి టికిరి పంచాయతీని సమితిగా గుర్తిస్తే మరింత అభివృధ్ది చెందుతుందని వివరించారు. టికిరి సమితిగా ఆవిర్భవిస్తే కొడాపరి, డొంగాశిలి, కుచేయిపొదొరొ, హడిగుడ, పొడాపడి, బంకాంబ, నకిటిగుడ, శొంకరడ, దుడుకాబహాల్, గోరఖ్‌పూర్ పంచాయతీలు విలీనమవ్వడంతో అభివృద్ధిని సాధిస్తాయని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బిభీషన్ మాఝి తదితరులు ఉన్నారు.