
‘మత్తు’బాటలో పాఠశాల విద్యార్థులు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి నలుగురు విద్యార్థులకు హెచ్‌ఎం కొలా బామనమూర్తి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇటీవల నలుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చారన్న వార్తలు మీడియాలో ప్రచురితం కావడంతో.. ఎందుకు ఇచ్చారో తెలియజేయాలని కోరడంతో రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్‌లో విద్యార్థుల వీడియోను పోస్టు చేశారు. కాగా, విద్యార్థులు తప్పుడు పనులు చేస్తే మందలించాల్సింది పోయి.. ఇలా టీసీలు ఇవ్వడం.. వీడియోను పోస్టు చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేయాలని ఉన్నత స్థాయి అధికారులను కోరారు.