రాజంపేట: ప్రతి మహిళ తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించి కుటుంబాన్ని ఆరోగ్యవంతమైన కుటుంబంగా తయారు చేయాలని మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి సూచించారు. మంగళవారం పీహెచ్‌సీ పరిధిలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మహాలక్ష్మి మాట్లాడారు. 45 మంది మహిళలకు పరీక్షలు, చికిత్స చేసినట్లు తెలిపారు. హెల్త్ సూపర్వైజర్ మొహమ్మద్ మంజూర్, గంగామణి, హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్, స్టాఫ్ నర్స్ ఇందిర, ఫార్మాసిస్ట్ పద్మ, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్‌లో మంగళవారం లయన్స్‌క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. 24 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. నలుగురిని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి రిఫర్ చేశారు. లయన్స్ సితాలే రమేష్, మేకల గాలయ్య, కొట్టూరి సంతోష్, మేకల విఠల్, రషీద్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వెనక మురికి కాలువ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మంగళవారం విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రవహిస్తున్న మురికి నీటిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మునుగుతోందని అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో మరమ్మతులు చేపట్టారు. ప్రమాదం జరగకుండా ఎత్తు పెంచామని, మురికి నిలువ ఉండకుండా మురికి కాలువ కట్టించి చుట్టూ మొరం వేయాలని మున్సిపల్ అధికారులను విద్యుత్ అధికారులు కోరారు.
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి