
9న అండర్ 19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
నిజామాబాద్ నాగారం: నగరంలో ఈనెల 9న అండర్ 19 బాలికల జిల్లా జట్టు ఎంపిక చేయడానికి పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలలో పాల్గొనేందుకు ఈ జట్లు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఈనెల 11, 12, 13 తేదీలలో సంగారెడ్డిలో నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా జట్టు తరఫున పాల్గొనేందుకుగాను రాజారామ్ స్టేడియంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే పోటీలకు అండర్ 19 బాలికలు హాజరు కావాలన్నారు.
నిజామాబాద్‌అర్బన్/ఖలీల్‌వాడి: రామాయణంను రచించిన మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి హాజరై, వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేసి, నివాళులు అర్పించా రు. అలాగే నగరంలోని సీపీ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి అదనపు డీసీపీ రామచంద్రరావు పూలమాలలు వేసి, పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వాల్మీకి ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, సప్త ఋషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంథాన్ని అందించినట్లు తెలిపారు. వాల్మీకిని అందరూ స్మరించుకోవాలని తెలిపారు. సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను, రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నర్సయ్య, సీపీ ఆఫీస్ సూపరింటెండెంట్‌లు శంకర్, బషీర్ అహ్మద్, రిజర్వు సీఐ శ్రీనివాస్, తిరుపతి, తదితరులు ఉన్నారు.

9న అండర్ 19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు