
ఎస్సెస్సీ మెమోలో మార్పులు సాధ్యమేనా?
మీకు తెలుసా?
ప్రతి ఒక్కరికి ఎస్సెస్సీ సర్టిఫికెట్ (పదో తరగతి మార్కుల మెమో) చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాలలో పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఈ సర్టిఫికెటే ఆధారమవుతుంది. మరి ఇలాంటి మెమోలోనే పుట్టిన తేదీ తప్పుగా ముద్రితమైతే?.. మార్చుకునేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే..
● ఎస్సెస్సీ ఫలితాలు విడుదలైన తర్వాత మూడేళ్ల లోపు మాత్రమే తప్పుగా ముద్రితమైన డేట్ అఫ్ బర్త్‌ను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
● మొదటగా పదో తరగతి పాస్ అయినా పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరణతో ఎంఈవో, అక్కడి నుంచి డీఈవో ద్వారా డీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకోవాలి.
● స్కూల్ రిజిస్టర్లో నమోదైన తేదీకి భిన్నంగా టెన్త్ సర్టిఫికెట్లో తేదీ నమోదైతే అధికారులు ధ్రువీకరించి మారుస్తారు.
● డీఎస్‌ఈ ఆమోదం తెలిపితేనే ఎస్సెస్సీ బోర్డు అధికారులు తేదీని మార్చి కొత్త సర్టిఫికెట్‌ను అందజేస్తారు. దీనికి ఎలాంటి ఫీజు ఉండదు.
● విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లలో తప్పులుంటే, ఇతర మైనర్ పొరపాట్లు ఉంటే బోర్డు అధికారులే సరి చేస్తారు.
● ఇంటి పేరు విద్యార్థి తల్లిదండ్రుల పేరు ఒక పేరుకు బదులుగా మరో పేరు ముద్రితమైతే హెచ్‌ఎం, ఎంఈవో డీఈవో ద్వారా పాఠశాల విద్యాశాఖ సంచాలకుని కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వారు వివరాలను పరిశీలించి మార్పులు చేయాలని ఎస్సెస్సీ బోర్డుకు పంపిస్తారు.
● ఒరిజినల్ టెన్త్ సర్టిఫికెట్ పోతే మీ సేవ కేంద్రం ద్వారా స్థానిక పోలీస్ స్టేషస్‌లో ఫిర్యాదు చేసి, పోలీసులు ఇచ్చే ధ్రువపత్రం తీసుకోవాలి.
● అలాగే గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరీ పేరుమీద రూ. 250 చలానా తీయాలి.
● సర్టిఫికెట్ పోయిందని, ఒకవేళ దొరికితే దాన్ని బోర్డుకు అప్పగిస్తానని అభ్యర్థి ధ్రువీకరిస్తూ రూ.50 స్టాంప్ పేపర్‌పై నోటరీ అఫిడవిట్ తీసుకోవాలి.
● వివరాలన్నింటితో పాటు హెచ్‌ఎం ధ్రువీకరణతో ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి.
● అన్ని వివరాలు సరిగా ఉంటే డూప్లికేట్ మెమోను అధికారులు జారీ చేస్తారు.
– రామారెడ్డి