
నగరంలో అర్ధరాత్రి సీపీ తనిఖీలు
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీచౌక్, నెహ్రూ పార్క్, శివాజీనగర్, కంఠేశ్వర్, దేవీ రోడ్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు చేశారు. సీపీ మాట్లాడుతూ నగరంలో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో ఉంటూ ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిని విచారించామన్నా రు. రాత్రివేళల్లో రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మళ్లీ రాత్రివేళలో తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజ ల రక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం పాటు పడుతోందని, పోలీసు సిబ్బందికి ప్రజలు సహ కరించాలని సీపీ కోరారు.