
అహ్మదీపురా కాలనీలో చోరీ
● రూ.7 లక్షల నగదు అపహరణ
ఖలీల్‌వాడి: నగరంలోని అహ్మదీపురా కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. అహ్మదీపురా కాలనీకి చెందిన సాబేర్ సెప్టెంబర్ 30న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలోని రూ. 7 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం అపహరణకు గురైందని బాధితుడు రెండో టౌన్ పోలీసులకు ిఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై సయ్యద్ ముజాహిద్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
తాళం వేసిన ఇంట్లో..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఆదివారం రాత్రి తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బైక్ మెకానిక్ బాలు ఆదివారం ఇంటికి తాళం వేసి బీర్మల్ తండాలో ఉన్న బంధువుల వద్దకు కుటుంబసభ్యులతో వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో దాచిన తులం బంగారు నగలు, 60 తులాల వెండితోపాటు కొంత నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.