
ఒడిశా టు నిజామాబాద్
ఖలీల్‌వాడి: ఒడిశా నుంచి నిజామాబాద్‌కు ఎండు గంజాయి తరలిస్తున్న బాలుడితోపాటు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈఎస్ విలాస్ సోమవారం తెలిపారు. నగరంలో ఎండు గంజాయిని విక్రయించేందుకు వచ్చిన ఒడిశాకు చెందిన బాలుడితోపాటు సిరికొండకు చెందిన వోలం వంశీ, తర్రి తరుణ్‌లను పట్టుకున్నామన్నారు. నిందితుల నుంచి 7.700 కిలోల ఎండుగంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒడిశాలో ఎండు గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే తెచ్చారని వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఈ దాడిలో ఎకై ్సజ్ సీఐ వెంకటేశ్, ఎస్సై రాంకుమార్ తదితరులు ఉన్నారు.
● 7.700 కిలోల ఎండు
గంజాయి స్వాధీనం
● ఇద్దరి రిమాండ్