
రైతును కాపాడిన అధికారులు
పిట్లం(జుక్కల్):పిట్లం మండలం తిమ్మానగర్ గ్రా మ శివారులో కాకి వాగు, నల్ల వాగు పొంగి పొర్లుతోంది. ఈ వరద ప్రవాహంలో చిక్కుకున్న ఫక్రి యా అనే రైతును అధికారులు కాపాడారు. పెద్దకొడప్‌గల్ మండలంలోని పోచారం తండాకు చెందిన ఫక్రియా పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామ శివారులో పొలం కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పొలానికి వెళ్లా డు. అదే సమయంలో పక్కనే ఉన్న కాకి వాగు, నల్ల వాగులో వరద పొంగి పొర్లడంతో ఫక్రియా చిక్కుకున్నాడు. పొలం దగ్గర ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నడు. గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచా రం అందించారు. స్పందించిన సహాయక బృందం తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరద ఉధృతి నుంచి రైతును సురక్షితంగా ర క్షించి, ఒడ్డుకు చేర్చారు. అయితే, పొలం వద్ద ఉన్న ఆవు, బర్రె వరదలో మృతి చెందాయి. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.