
జెడ్పీ పీఠం మాదే!
న్యూస్‌రీల్
నిజామాబాద్
మా హయాంలోనే తెయూ..
పక్కా ప్రణాళికతో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నాం
● ఉనికి కోసమే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల పోరాటం
● కవిత ఎపిసోడ్ బీఆర్‌ఎస్‌కే నష్టం
● బీజేపీ బీసీ బిడ్డలకు ద్రోహం చేస్తోంది
● ‘సాక్షి’ ముఖాముఖిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కో ఆపరేటివ్
యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి
● అధికారులకు నిర్దేశించిన
కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
● వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ
అంశాలపై సమీక్ష
తొలి గంట.. మోసానికి అడ్డుకట్ట
సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మోసం జరిగి న గంటలోపు ఫిర్యాదు చేయాలంటున్నారు.
మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– 8లో u
రేషన్‌కార్డుల
మంజూరుకు బ్రేక్
సుభాష్‌నగర్: జిల్లాలో రేషన్‌కార్డుల మంజూరును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్‌వో) అరవింద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని దీంతో మంజూరు ప్రక్రియ చేపట్టడంలేదన్నారు. అదేసమయంలో అర్హులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని , కోడ్ ముగిసిన తర్వాత మంజూరు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
జిల్లాకు ఆరుగురు ఏవోలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ శాఖలో ఏ ఈవోలుగా పని చేస్తున్న వారికి రాష్ట్ర ప్రభు త్వం ఏవోలుగా ఇటీవల పదోన్నతి కల్పించింది. అందులో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఆరుగురు ఏవోగా పదోన్నతులు పొంది జిల్లాకు వచ్చారు. చందూర్ ఏవోగా కిరణ్, మోస్రాకు వెంకటేశ్, డిచ్‌పల్లికి ఆంజనేయులు, వేల్పూర్ ఏవోగా రాజుకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే శ్రీనివాస్, రమేశ్‌లకు జిల్లా కార్యాలయంలో టెక్నికల్ ఏవోలుగా పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరారు. జిల్లాలోని వేల్పూర్ ఏఈవోగా పని చేసిన తిరుమలకు ఏవోగా పదోన్నతి కల్పించి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు బదిలీ చేశారు.
మద్యం షాపులకు
35 దరఖాస్తులు
ఖలీల్‌వాడి : మద్యం షాపులకు సోమవారం 35 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ద రఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందన్నారు. నిజామాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 11 షాపులకు 18 దరఖాస్తు లు, బోధన్‌లో నాలుగు మద్యం షాపులకు ఐదు, ఆర్మూర్‌లో నాలుగు షాపులకు ఐదు, భీంగల్‌లో మూడు షాపులకు నాలుగు, మో ర్తాడ్‌లో రెండు షాపులకు 3 దరఖాస్తులు వ చ్చాయన్నారు. జిల్లాలో మొత్తం 102 మ ద్యం షాపులు ఉన్నాయన్నారు.
పోలీస్ ప్రజావాణికి
18 ఫిర్యాదులు
ఖలీల్‌వాడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సీపీ సాయిచైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు, సీఐలకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పో లీసు సేవలను వినియోగించుకోవాలని సూ చించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సా గడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చే స్తోందన్నారు. బాధితులు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన రెవెన్యూ అధికారి
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా రెవెన్యూ అ ధికారిగా సీహెచ్ మధుమోహన్ నియమితులయ్యారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2019 ఫిబ్రవరి 7 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
జిల్లా ప్రజాపరిషత్ పీఠాన్ని గెలుచుకునేందుకు కచ్చితమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. అత్యధిక ఎంపీపీలు, గ్రామ పంచాయతీలు గెలుచుకుంటాం. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాం. మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో పార్టీలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది.
జిల్లాలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్థానిక ఎన్నికల్లో ఉనికి కోసం పోరాటం చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం, అభివృద్ధిలో రాజీలేకుండా ముందుకెళుతున్నాం. చిత్తశుద్ధితో ప్రజాసమస్యల పరిష్కారం చేస్తున్నాం. లోలోపల ఒక్కటిగా ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని బదనాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ముఖ్య నాయకులతో కలిసి దిశానిర్దేశం చేస్తున్నాం. ప్రజలతో మమేకమై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరాం.
● కవిత ఎపిసోడ్‌తో బీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో నష్టం కలుగుతోంది. కవిత ప్రభావం బీఆర్‌ఎస్‌పైనే ఉంటోంది. పదేళ్లు తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కవిత జిల్లాకు చేసింది శూన్యం. చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు.
జిల్లాకు కో ఆపరేటివ్ శిక్షణ కేంద్రం
ఇప్పటి వరకు హైదరాబాద్, వరంగల్‌లలో మాత్ర మే కోఆపరేటివ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. తాజా గా మహబూబ్‌నగర్, ఖమ్మంలతో పాటు నిజామాబాద్‌లోనూ ఏర్పాటు చేయనున్నాం. ఇది మంచి అచీవ్‌మెంట్. ఈ శిక్షణ కేంద్రాన్ని ఆర్మూర్‌లో త్వరలో ప్రారంభించనున్నాం.
జిల్లా కాంగ్రెస్ పీఠాన్ని మరోసారి ఆశించడం లేదు. కొత్త రక్తానికి అవకాశం ఇచ్చేందుకు రేసు నుంచి తప్పుకున్నాను. 14 నెలల క్రితం రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియామకమైనప్పటి నుంచి డీసీసీ పీఠాన్ని మరొకరికి అప్పగించాలని పార్టీ నాయకత్వాన్ని నేను కోరుతూ వస్తున్నాను.
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అంకిత్, పాల్గొన్న సబ్ కలెక్టర్ వికాస్ మహతో
అదనపు కలెక్టర్ అంకిత్
బోధన్: ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించి, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ అంకిత్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పీవోలకు సూచించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్‌లో సోమవారం డివిజన్ పరిధిలోని బోధన్, సాలూర, ఎడపల్లి, రెంజల్, రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, మోస్రా, చందూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పీవోలు 613 మందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు పోలింగ్ పక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధులు, బాధ్యతలను వివరించారు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైయినర్స్, ఎంపీడీవోలు శ్రీనివాస్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుంది
జెడ్పీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కలిసి నిర్ణయిస్తారు. పనిచేసిన వారికి పార్టీ తగిన న్యాయం చేస్తుంది. ఇప్పటికే జిల్లా నుంచి ఐదుగురిని కార్పొరేషన్ చైర్మన్లుగా చేసింది. మార్కెట్ కమిటీ, నుడా పదవులను భర్తీ చేసింది. జెడ్పీతో పాటు ఎంపీపీలు అన్నీ గెలుచుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, సన్నధాన్యం బోనస్, రుణమాఫీ, భూభారతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సిలిండర్, ఉచిత బస్సు పథకాలు అమలు చేస్తున్నాం. గురుకులాల్లో, వసతి గృహాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం. 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ తారీఖున జీతాలు వస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ వర్సిటీ, మెడికల్ కళాశాల వచ్చాయి. ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాల ఇచ్చిందీ కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్‌ఎస్ హయాంలో తెయూలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇన్‌చార్జుల పాలనతో తెయూ నడిచింది. మా ప్రభుత్వం వచ్చాక రెగ్యులర్ వీసీని నియమించి తెయూ పాలనను పూర్తిగా సరిచేశాం. బీఆర్‌ఎస్ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. బోధన్ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్లు, బాల్కొండలో రెండు మంజూరు అయ్యాయి.

జెడ్పీ పీఠం మాదే!

జెడ్పీ పీఠం మాదే!

జెడ్పీ పీఠం మాదే!