
పక్కాగా అసైన్డ్, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వే
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని ఆయా మండలాల్లో గల అసైన్డ్ భూములు, భూదాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అసైన్డ్, భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సర్వేయర్లచే పక్కాగా సర్వే జరిపించి, విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్ తదితర సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. జియో ట్యాగింగ్ చేయాలని, భూభారతి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామాల వారీగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో సేకరించిన దరఖాస్తుల కంటే ముందు ఆన్లైన్‌లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆర్జీలను ఆయా మాడ్యుల్స్ లో విభజించిన నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలన్నారు. సాదా బైనామా దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకుని పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం గ్రామ పాలన అధికారుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీవో రాజేంద్రకుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు
వర్ని: రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదు లు, దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహి స్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం వర్ని తహసీల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. భూభారతిపై సమీక్ష నిర్వహించారు.
రైతుల సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు జాప్యం చేయడంపై మండిపడ్డారు. సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నా యి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థా యి పరిశీలన పూర్తయిందని అధికారులను ప్ర శ్నించారు. 2 నెలలుగా దరఖాస్తులు పెండింగ్లో ఉండడానికి కారణాలు ఏంటని మండిపడ్డారు.