దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి.. | - | Sakshi
Sakshi News home page

దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి..

Oct 6 2025 2:00 AM | Updated on Oct 6 2025 2:00 AM

దశాబ్

దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి..

ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు

నిర్వహించిన పూర్వవిద్యార్థులు

ఆత్మీయ పలకరింపులతో

భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు

భిక్కనూరు/బాన్సువాడ రూరల్‌/పిట్లం/పెర్కిట్‌: చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒ క్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. అరే ఎ న్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయా వంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. బాన్సువాడలోని జీజేసీలో 1979–80 బ్యాచ్‌ ఎస్సెస్సీ విద్యార్థులు ఆది వారం తాడ్కోల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆనాటి గురువులు మధుసూదన్‌, వెంకటసుబ్బయ్యలను విద్యార్థులు సన్మానించారు. రామకృష్ణారెడ్డి, నార్ల భాస్కర్‌, రమేష్‌, బ్రహ్మం, రాంరెడ్డి, కృష్ణరెడ్డి పాల్గొన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982–83 ఎస్సెస్సీ పూర్వ విద్యా ర్థులు మాసుపల్లి పోచమ్మ ఆలయం వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమ పూర్వ విద్యార్థుల కమిటీ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మల్లేషం, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా కుష న్‌ మల్లేషం, కోఽశాదికారిగా ఉప్పరి యాదగిరితోపా టు పలువురిని ఎన్నుకున్నారు., అలాగే భిక్కనూరు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2002–03 బ్యాచ్‌ ఏడో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పిట్లం జెడ్పీహెచ్‌ఎస్‌ 1993– 96 బ్యాచ్‌ 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. పెర్కిట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ 1996–97 బ్యాచ్‌ ఎస్సెస్సీ విద్యార్థులు ఓ ఫంక్షన్‌హాల్‌లో సమ్మేళనం నిర్వహించారు.

దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి.. 1
1/1

దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement