
సిరికొండ మండలంలో భారీ వర్షం
సిరికొండ: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. వర్షంతో కోతకు వచ్చిన పంటలకు ఇబ్బంది నెలకొంది. కొండూర్ గ్రామంలో వరి కోతలు నడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్కోల్, న్యావనంది, నర్సింగ్‌పల్లి, చీమన్‌పల్లి గ్రామాల్లో మొక్కజొన్న, సోయాబీన్ కోతలు నడుస్తున్నాయి. వర్షానికి మక్కలు, సోయలు తడిచే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నా. పంట ఉత్పత్తులు తడవకుండా వాటిని తాటిపత్రులు, పాలిథిన్ కవర్లతో కప్పి కాపాడుకుంటున్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. లక్ష్మినగర్ తండాకు చెందిన భానోత్‌శంకర్ (55) ఆదివారం జంగంపల్లి గ్రామశివారులోగల జా తీయ రహదారి పక్కన సీతాఫలాలు విక్రయిస్తూ, తన టీవీఎస్ మోపెడ్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రిజా కారును డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడు. జంగంపల్లి శివారులో కారు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మనోహర్, ని శాంత్‌లకు గాయలయ్యాయి. అనంతరం కారు సీతాఫలాలు విక్రయిస్తున్న బానోత్‌శంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పో లీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం కామారెడ్డి ఏరియా ఆ స్పత్రికి తరలించా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సైవివరించారు.

సిరికొండ మండలంలో భారీ వర్షం

సిరికొండ మండలంలో భారీ వర్షం