
ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి
మాచారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పాల్వంచ మండల కేంద్రంలో మున్నూరు కాపు కల్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కోరారు. పాల్వంచ మండల శాఖ అధ్యక్షుడు అనిల్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బాల్ రాజు, మండల ఇన్‌చార్జి పండ్ల ప్రవీణ్, నాయకులు మదనాల శ్రీనివాస్, నరసింహాచారి, నరేష్, శ్రీనివాస్ ఉన్నారు.