
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సాక్షి నెట్‌వర్క్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లోని ప లు గ్రామాల్లో దసరా మరుసటి రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి దసరా మరుసటి రోజు శుక్రవారం రావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలను శనివారం జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, యువతులు ఉదయం రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం గ్రామ కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం మహిళలు, యువతులు, చిన్నారులు వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ప్రజలందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి, స్థానిక చెరువులు, కుంటల్లో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో అరుణోదయ విమలక్క పాల్గొన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఆడ పడుచుల పండుగ అని ఆమె పేర్కొన్నారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు