
రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిక్షణ పూర్తి
డిచ్‌పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి చదువుతున్న విద్యార్థు లు బి అభినయ్, ఎం అక్షయ్ (ఎన్‌సీసీ కేడెట్లు) రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిబిరంలో శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్‌సీసీ అధికారి, సెకండ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఖత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు శిక్షణ శిబిరం కొనసాగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇన్‌చార్జి హెచ్‌ఎం మాధవ్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం ప ట్టింది. శనివారం ఉదయం నుంచి క్రమంగా త గ్గుతూ సాయంత్రానికి 60 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. 9 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూ సెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాకతీ య కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కె ప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. తాగు నీటి అవసరాల కు మిషన్‌భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 691 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 ( 80 టీఎంసీలు) అడుగుల నీటిమట్టం ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
బాల్కొండ: ఇంటి నిర్మాణాల కోసం ఇసుక తిప్పలు ఎక్కువయ్యాయి. దీంతో వాగులు, వంకలు కాకుండ ఏకంగా గోదావరి నుంచే ఇసుకును తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ముందర గోదావరి నుంచి ఇసుకను తీస్తు కుప్పలు వేస్తున్నారు. అనంతరం కుప్పలను తరలిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురవడంతో వాగుల నుంచి ఇసుకను తీసే అవకాశం లేదు. అంతేకాకుండ ఇసుక తరలింపునకు అనేక అనుమతుల అవసరం ఉండటంతో కనీసం ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడ ఇసుక లభించడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు గోదావరి నుంచి ఇసుకను తీస్తూ, వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోదావరిలో ఇసుక తరలింపు పక్కదారి పట్టకుండ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిక్షణ పూర్తి

రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిక్షణ పూర్తి