
మెజార్టీ స్థానాలు గెలుపొందాలి
● ఇచ్చిన హామీలను అమలు
చేయడంలో విఫలమైన కాంగ్రెస్
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేష్ పటేల్ కులాచారి
డిచ్‌పల్లి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకునేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌జీ గార్డెన్స్‌లో బీజేపీ మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా అంకితభావంతో పని చేయాలన్నారు. వార్డులు, గ్రామాలు, మండలంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్, మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, పార్టీ మండల అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరమణ, శ్యాంరావు, సతీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, చౌకి లక్ష్మణ్, విఠల్, సురేష్, విష్ణు, నారాయణరెడ్డి, గాండ్ల లక్ష్మీనారాయణ, పరుశురాం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీపై కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం ..
నిజామాబాద్ రూరల్: జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో రూరల్ మండల కార్యకర్తల సమావేశంతోపాటు మోపాల్ మండల కార్యకర్తల సమావేశం నర్సింగ్‌పల్లి గ్రామ శివారు ఎస్‌ఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అ నుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి కృషి చే యాల్సిన విధానాలపై ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో పద్మరెడ్డి,జగన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, రవి,గోపి,బిలోజి నాయక్, ఆనంద్, సందీప్, మోపాల్ మండల ఇంచార్జి ప్రమోద్ కుమార్ మండలపార్టీ అద్యక్షుడు శాశంక్ రెడ్డి, సీనియర్ నాయకులు రవి,బోడ మహెంధర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.