
ఆపన్న హస్తం అందించరూ!
● ఆర్మూర్‌కు చెందిన
శాంతిలాల్‌కు ఫెయిలైన కిడ్నీలు
● వైద్యం కోసం రూ.లక్షల్లో ఖర్చు
● దాతలు ఆదుకోవాలంటూ
కుటుంబీకుల వేడుకోలు
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్‌కు చెందిన కల్యాణి పట్టణంలోని హెడ్ పోస్ట్‌ఆఫీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె భర్త దేదావత్ శాంతిలాల్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో గత రెండేళ్లుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. వైద్యానికి ఇంకా రూ.లక్షల్లో అవసరం ఉండగా పేదరికం కారణంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒకరోజు విడిచి మరోజు డయాలసిస్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఏ పని చేయలేపోతున్నారు. కాగ కల్యాణి చిన్న కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. భర్త వైద్యం కోసం చేసిన అప్పులు పేరుకుపోయాయి. కుటుంబానికి ఎలాంటి ఆసరా లేకపోవడం, పేదరికం కారణంగా అప్పులు తీర్చలేక, భర్తకు మెరుగైన వైద్యం అందించలేకపోతుంది. ఎవరైన దాతలు ముందుకువచ్చి తన భర్తను కాపాడాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు ఫోన్‌పే నంబర్: 9121744642కు చేయాలని కోరుతున్నారు.